చాకలి ఐలమ్మ వర్ధంతి, జయంతి కార్యక్రమాల నిర్వహణపై రౌండ్ టేబుల్ సమావేశం
ఖమ్మం నగరంలోని మమతా రోడ్డు లకారం ట్యాంక్ బండ్ దారిలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణవరపు శ్రీనివాస్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ బహుజన కులాలు మొత్తం ఐక్యంగా ఉండి పీడిత ప్రజల అభ్యున్నతి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ యొక్క వర్ధంతి మరియు జయంతి కార్యక్రమాలను సమిష్టిగా పెద్ద ఎత్తున జన సమీకరణతో ఘనమైన నివాళులర్పించాలని పిలుపు నిచ్చారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుల పోరం జిల్లా అధ్యక్షులు డాక్టర్ కెవి.కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడాన్ని స్వాగతిస్తూనే ఆ కార్యక్రమానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు చాలా తక్కువగా ఉన్నాయని అది సరైన విధానం కాదని జయంతి వర్ధంతి కార్యక్రమాలకు లక్ష రూపాయల వరకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బీసీ సెల్ నాయకులు సుగుణరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడు లేని విధంగా చాకలి ఐలమ్మ వర్ధంతి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. చాకలి ఎస్సీ సాధన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ ట్యాంక్ బండ్ నిలువెత్తు చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని దానికి అయ్యే పూర్తి ఖర్చుని ప్రభుత్వమే భరించాలని తెలిపారు. అనంతరం వివిధ సంఘాల ప్రముఖులు మాట్లాడారు అనంతరం ఖమ్మం ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి, బీఎస్పీ పార్టీ ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జి అయితగాని శ్రీనివాస్ గౌడ్, మహాత్మ జ్యోతిరావు పూలే, ఐడియాలజీ సొసైటీ అధ్యక్షులు పేలూరి విజయకుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగనబోయిన పుల్లారావు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి సుగుణ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నారపు నాగ రామాచారి, శాలివాహన సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నరసయ్య, చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటప్పయ్య, తెలంగాణ బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పెరుగు వెంకటరమణ, బాసాటి హనుమంతరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రామారావు, ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి రెహమాన్, బీసీ ఫ్రంట్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు నాయుడు, న్యూ లక్షణ సంస్థ గరిడేపల్లి సత్యనారాయణ ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు మామిడి వెంకటేశ్వర్లు రజక సంఘం నాయకులు తెనాలి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]