- * విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దెబ్బతిన్న గృహాలను సందర్శించిన హోం మంత్రి
* బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం రూ.10 వేలు, 50 కేజీల బియ్యం అందచేత
హోమ్ మంత్రి తానేటి వనిత
బుధవారం సాయంత్రం తాళ్లపూడి మండలం రావులుపాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కోలి శెట్టి కృష్ణ కుటుంబ సభ్యులకు చెందిన ఇళ్ళు
భారీ అగ్నిప్రమాదానికి గురి కావడం జరిగిందన్న విషయం తెలుసు కున్న రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు డా. తానేటి వనిత వెంటనే ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్ళడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, విద్యుత్ ఘటనలో దగ్ధమైన కృష్ణ కుటుంబ సభ్యులకు చెందిన రెండు ఇళ్ళను కూడా శాంక్షన్ చేసి నేనున్నా అంటూ భరోసా ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కల సాకారం చేస్తోందని అన్నారు. బాధిత కుటుంబాలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం, 50 కేజీ ల బియ్యం చొప్పున అంద జేశామన్నారు.
తాళ్లపూడి మండల నాయకులతో తో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!