గురు న్యూస్ విశాఖపట్నం : 56 వార్డు ముత్యమాంబ కాలనీ ప్రెసిడెంట్ జీవ ఆహ్వానం మేరకు ముత్యమాంబ కాలనీలో Tidco టిట్కో ఇండ్ల గృహప్రవేశాలు టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గారు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గణబాబు గారు మాట్లాడుతూ ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ గృహప్రవేశాలు ఎంతో సంతృప్తి ఇచ్చిందని ఆనాడు (slum clearance project) స్లమ్ క్లియరెన్స్ భాగంగా చాకలి గడ్డ దయానంద్ నగర్ ముచ్చమాంబ కాలనీ గుర్తించి పక్కా ఇల్లులు కట్టించే కార్యక్రమాన్ని తీసుకున్నామని గుర్తు చేస్తూ, కాలనీ వాసులకు అపరిశుభ్రమైన వాతావరణంలో నివాసంలో నుంచి ఇప్పుడు పక్కా గృహాలు లో ఎంతో మెరుగైన జీవన పరిమాణాలతో భావితరాలకు జీవన విధానాన్ని పెంపొందించేందుకు దోహద పడుతుందని అన్నరు. ఈ కార్యక్రమంలో 56 వార్డ్ కార్పొరేటర్ శరగడం రాజశేఖర్ గారు మరియు ముఖ్య నాయకులు, స్థానికులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!