in ,

హెల్త్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన హోం మంత్రి వనిత

తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో  బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కు రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత శంకుస్థాపన చేశారు. శనివారం నాడు జాతీయ ఆరోగ్య మిషన్ 15వ ఆర్థిక సంఘం నిధుల క్రింద 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న పనులను హోంమంత్రి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని, నాణ్యతా విషయంలో ఎక్కడా రాజీపడొద్దని కాంట్రాక్టర్ ను హోంమంత్రి ఆదేశించారు.  

ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ..  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్యరంగంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి పేదవారికి కూడా కార్పోరేట్ వైద్యం ఇంటి ముంగిటనే అందిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలోని ఆరోగ్య శ్రీ కింద అందించే సేవల సంఖ్యను పెంచారని, అంతేకాక పలు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారని వివరించారు. పేద వారు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ ఉన్నారని స్ఫష్టం చేశారు. అలాగే ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గం మలకపల్లి  బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ (BPHC)నూతన నిర్మాణంలో ఒక అత్యాధునిక ల్యాబ్, అడ్మినిస్ట్రేటివ్ భవనం కలిగి ఉంటుందని తెలిపారు.  కొవ్వూరు డివిజన్ లో ఉన్న అన్ని పీహెచ్‌సీ సంబంధించిన అన్ని ఆరోగ్య విషయాలను ఈ యూనిట్ నుండి మానిటరింగ్ చేస్తారన్నారు. హెల్త్ మిషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా విశ్లేషించిన డేటాను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తారని ఆమె వివరించారు.  తాజాగా జగనన్న ఆరోగ్యసురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి సర్వే చేయడమే కాకుండా వారికి అవసరమైన వైద్యం, మందులను కూడా ఉచితంగా అందిస్తున్నారని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

మైనారిటీ మ రవికుమార్ ఎన్నిక పట్ల బీజేపీ నేతలు హర్షం

పేదలందరికీ ఇళ్లు మా ప్రభుత్వ లక్ష్యం : హోంమంత్రి తానేటి వనిత