చవితి వేడుకలకు మరో 8 రోజుల గడువుండగా వాడవాడలా కొలిచేందుకు గణేష్ ఉత్సవ మండళ్ల నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చర్ల కు చెందిన కళాకారులు గణనాథుల ఉత్సవమూర్తులను సుందరంగా రూపొందిస్తున్నారు. ఈసారి వర్షాలు విస్తారంగా కురిసి చెరువులు గోదావరి జలకళతో ఉట్టిపడుతుండగా నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో రెట్టించిన ఉత్సాహంతో గణేశ్ వేడుకలు నిర్వహించే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కొన్ని జిల్లాలోనే గణేశ్ ప్రతిమలను విక్రయించే పరిస్థితి ఉండగా ఇప్పుడు మారుమూల చర్ల గ్రామాల్లో సైతం ప్రతిమలను తయారు చేస్తున్నాన్నారు. వినాయక చవితి దగ్గర పడుతుండడంతో వేగంగా గణనాథులను కళాకారులు రేయింబవళ్లు కష్టపడి తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే చర్ల మండలంలోని పలుచోట్ల ప్రత్యేకంగా గణనాథుల ప్రతిమలను అందంగా తీర్చిదిద్ది విక్రయానికి సిద్ధంగా ఉంచారు.
[zombify_post]