చర్ల మండలంలోని బెల్ట్ షాపులు గుడుంబా విక్రయాల దందా మూడు బాటిళ్లు ఆరు గుడుంబా ప్యాకెట్లు గా కాసుల వర్షాన్ని కురిపిస్తుంన్నాయి అని మహిళలు ఆరోపిస్తున్నారు. మండలంలో ఎక్కువగా గిరిజన గ్రామాలే ఉన్నందున బడి గుడి అనే తేడా లేకుండా గల్లి గల్లి కో బెల్ట్ షాపులు గుడుంబా విక్రయాలు విచ్చలవిడిగా వెలసి అమాయక ప్రజల మణా ప్రాణాలను చీధ్రం చేస్తున్న అధికారులు నీమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మహిళ లోకం గగ్గోలు పెడుతుంది. మంచినీళ్లు దొరకని షాపులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు కానీ మద్యం దొరకని చోటంటూ లేకపోవడం గమనార్హం. నివాస గృహాలు చిన్నచిన్న కిరాణా దుకాణాలలో కావలసినంత మద్యం దొరుకుతుంది. పొద్దంతా పనిచేసే సంపాదించిన సొమ్మును మద్యానికి గుడుంబా కి వెచ్చిస్తూ కుటుంబాలను వీధి పాలు చేస్తున్న మహమ్మారి బెల్ట్ షాపులను గుడుంబా విక్రయాలను అరికట్టాలని మహిళలు కోరుతున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!