గత కొన్ని రోజులుగా తమ సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన తెలుపుతున్నప్పటికీ స్పందించే వారి లేరని ఈరోజు ఎమ్మెల్యే కు వినతిపత్రం సమర్పిస్తామని వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని ఆశా వర్కర్లు ఆందోళన చేసిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ ముందు ఈరోజు ఆశా కార్యకర్తలు మధ్యాహ్న భోజన వంట కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చాలని ఎమ్మెల్యే నిర్వహించే కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు, అయితే అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో కాస్త ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది పోలీసులకు ఆశా వర్కర్ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది, తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం ముందు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు పోలీసుల అడ్డుకోవడంతో తమ డిమాండ్లను చెప్పేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు ఆ తర్వాత ఎమ్మెల్యే వినతిపత్రం తీసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చెప్పడంతో శాంతించారు
This post was created with our nice and easy submission form. Create your post!