ఈ నెల 24న పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు ప్రారంభంకానున్నాయి. కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గంలో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. దాంతో పాటు కొత్తగా విజయవాడ – చెన్నై రూట్‌లోనూ రైలు పట్టాలెక్కనున్నది. ఈ రైలు సోమవారం నుంచి కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది. తిరిగి యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 2:45 గంటలకు బయల్దేరి.. రాత్రి 11:15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఉదయం విజయవాడలో 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటల వరకు చెన్నైకి చేరుతుంది. తిరిగి అక్కడి నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుంది. ప్రస్తుతం విజయవాడ – చెన్నై మధ్య ఇంటర్ సిటీ పినాకిని ఎక్స్‌ప్రెస్ నడుస్తున్నది.
హైదరాబాద్-బెంగళూరు మధ్య వందేభారత్ ప్రారంభమైతే ప్రయాణ సమయం మరింత తగ్గుతుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య అత్యంత వేగంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు బెంగళూరు నుంచి 10 గంటల్లో హైదరాబాద్ చేరుకుంటుంది.