నెల్లిమర్ల మండలం కొండగుంపాంలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్యశిబిరంలో 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని సర్పంచి పతివాడ అప్పన్న ప్రారంభించారు. శిబిరంలో రోగులకు ఉచితంగా బిపి, షుగర్ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన రోగులకు మందులు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]