చంద్రబాబు విడుదల కావాలని కొవ్వూరు టీడీపీ నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలను బుధవారం రాత్రి మాజీ హోం మంత్రి చిన రాజప్ప నిమ్మరసం ఇచ్చి విరమింప జేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, రిమాండ్ ను నిరశిస్తూ కొవ్వూరు టీడీపీ నాయకులు మండలంలోని వాడపల్లి గ్రామంలో బూరుగుపల్లి వీర రాఘవులు ఇంటి వద్ద గత నాలుగు రోజులుగా అమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. కాగా గత రాత్రి కొవ్వూరు పోలీసులు టీడీపీ చేపట్టిన దీక్షలను భగ్నం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జవహర్, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]