in , ,

చంద్రబాబు కు భద్రత కల్పించడం మా బాధ్యత: మంత్రి బొత్స

తెదేపా అధినేత చంద్రబాబుకు జైల్లో కల్పించే భద్రతపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏదైనా లోపం జరిగితే దానికి తాము పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పారు. విజయనగరంలో బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కాదని.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ప్రమేయం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలన్నారు.
మరోవైపు మహిళా బిల్లుపై బొత్స స్పందించారు. కేంద్రం ప్రతిపాదించిన ఆ బిల్లుకు తమ ప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించిన ఘనత తమదని చెప్పారు.

[zombify_post]

Report

What do you think?

చంద్రబాబు విడుదల కావాలని మోకాళ్ళ ప్రదర్శన

సూర్యాపేట మండలాన్ని స్వచ్ఛతగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి: ఎంపిపి బీరవోలు