పాడేరు, అల్లూరి జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, రిమాండ్ ను నిరశిస్తూ పాడేరు లో మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షలు మంగళవారం 7వ రోజుకు చేరుకున్నాయి. పాత బస్తాండ్ లోని అంబేద్కర్ కూడలి వద్ద చేపట్టిన ఈ దీక్షలకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు నాయకులు మాట్లాడుతూ… కేవలం రాజకీయ కక్ష తోనే జగన్ చంద్రబాబు ను అరెస్టు చేయించి జైల్లో పెట్టరన్నారు. త్వరలో చంద్రబాబు కడిగిన ముత్యం లా బయిటకు వస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేస్తుందని చెప్పారు.
[zombify_post]