పాడేరు సెప్టెంబర్ 19 : స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తన మానవత దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. స్థానిక సీఐ సుధాకర్ ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వచ్ఛందంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ వద్ద వెళ్లి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటికే 27వ సారి రక్తదానం చేసి ఆయన మానవత్వం దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆయన ఇచ్చిన రక్తం అనేక కుటుంబాలకు27 ప్రాణాలను కాపాడిన వారయ్యారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఆయన మానవత్వ దాతృత్వన్ని కొనియాడారు. పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించడంతోపాటు మానవతా దృపథంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణదాతలు అవుతున్నారని పాడేరు రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పడిన తర్వాత సుమారు ఏడుసార్లు పాడేరు పట్టణంలోనే ఆయన రక్తదానం చేశారని అన్నారు . గతంలో విశాఖపట్నం,శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీకి ఆయన రక్తదానం చేశారని తెలిపారు . ఆయన చేస్తున్న రక్తదానాన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని రక్తం దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సభ్యులు పాల్గొన్నారు.
[zombify_post]