గాయపడిన వ్యక్తిని కరీంనగర్ తరలిస్తున్న 108 అంబులెన్స్ సిబ్బంది
ధర్మారం. సెప్టెంబర్ 19 గురు న్యూస్ : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది గుర్తు తెలియని వాహనం ఢీకొని కొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తికి కుడి కాలు తెగిపడినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే పెద్దపెల్లి జిల్లాలోని ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి కనకదుర్గమ్మ దేవాలయం వద్ద కొత్తూరు గ్రామానికి చెందిన తమ్మనవేణి లచ్చయ్య (50) కు గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కుడికాలు తెగి తీవ్ర గాయాలు కాగా స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ లో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం విషయం తెలుసుకున్న ధర్మారం పోలీస్ శాఖ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

[zombify_post]