అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు జెడ్పిటిసి వారా నూకరాజు గాయపడ్డారన్న విషయం తెలుసుకున్న వెంటనే పాడేరు శాసనసభ్యులు కొటగుళ్లి భాగ్యలక్ష్మి అతన్ని పరామర్శించారు. గాయపడ్డ నూకరాజు గారు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినను భాగ్యలక్ష్మి గారు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ తో చర్చించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు
జడ్పిటిసి వారా నూకరాజు పై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కోరారు. గొలుగొండ మండలం చటర్జీపురం గ్రామంలో తన భూమిలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారా నూకరాజు పై ముందస్తు ప్రణాళిక ప్రకారం అతనిపైనా అక్కడ పని చేస్తున్న అతని కుటుంబ సభ్యులపైనా కళ్ళల్లో కారం కొట్టి ఆయుధాలతో దాడి చేశారని, ఈ దాడిలో నూకరాజు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. పోలీసులు కూడా ఇందులో నూకరాజు తప్పేమీ లేదని చెబుతున్న నేపథ్యంలో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. నూకరాజు తామంతా అండగా నిలుస్తామని తెలిపారు. తన భూమి సాగు చేసుకుంటున్నా సంబంధం లేని వ్యక్తులు ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడి చేయడం వెనక ఏదో కుట్ర దాగి ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ జరపాలని డీఎస్పీని కోరినట్లుగా ఆమె పేర్కొన్నారు.
నూకరాజు గారిని పరామర్శించిన వారిలో ఎంపీపీ బడుగు రమేష్, వైస్ ఎంపీపీ రమణ, సీనియర్ నాయకులు గాడి సత్తిబాబు, సుధాకర్, పార్టీ మండల ప్రెసిడెంట్, జల్లిబాబులు, శేఖర్, పిఎసిఎస్ చైర్మన్ సూరిబాబు, అచ్చిరాజు తదితరులు ఉన్నారు.
[zombify_post]