వినాయక చవితి పురస్కరించుకుని ఆదివారం జిల్లాలోని అన్నిమార్కెట్లు కొనుగోలుదారులతో కళకళలాడాయి. సోమవారం నిర్వహించే చవితి కోసం వినాయకుని ప్రతిమలు, పూజాసామగ్రి, పండ్లు, పువ్వులు, స్వీట్లు, తదితర సామగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రజలు మార్కెట్‌కు తరలివచ్చారు.
మార్కెట్‌కు చవితి కళ
కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న విజయనగరం
విజయనగరం రూరల్, సెప్టెంబరు 18 వినాయక చవితి పురస్కరించుకుని ఆదివారం జిల్లాలోని అన్నిమార్కెట్లు కొనుగోలుదారులతో కళకళలాడాయి. సోమవారం నిర్వహించే చవితి కోసం వినాయకుని ప్రతిమలు, పూజాసామగ్రి, పండ్లు, పువ్వులు, స్వీట్లు, తదితర సామగ్రిని కొనుగోలు చేసేందుకు ప్రజలు మార్కెట్‌కు తరలివచ్చారు. దీంతో విజయనగరం, బొబ్బిలి, ఎస్.కోట, గుర్ల, గరివిడి, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, నెల్లిమర్ల తదితర ప్రాంతాల్లోని మార్కెట్‌లు కిటకిటలాడాయి. పోలీసులు కొన్నిచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. విజయనగరం ఎంఆర్ కళాశాల రోడ్డు నుంచి గంటస్తంభం వరకూ ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలను మార్కెట్ లోపలకు అనుమతించలేదు. కోట, ఆర్‌అండ్‌బీ, బొంకులదిబ్బ, రింగురోడ్డు, రైతు బజారు, వీటి అగ్రహరం తదితర జంక్షన్లు, ముఖ్య కూడళ్లలో వినాయక ప్రతిమలు, పూజాసామగ్రి విక్రయాలు సాగాయి.
[zombify_post]