టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా టిడిపి నాయకులు మంగళవారం చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు జిల్లా. అనంతరం నేతలను అరెస్టు చేసి పోలీస్ బ్యారెక్స్ తరలించారు.అరెస్టయిన వారిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గండి బాబ్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ కోరాడ రాజబాబు, మాజీ కార్పొరేటర్ పైలా ముత్యాలనాయుడు, పొడుగు కుమార్, ముల్లేటి కుమార్ స్వామి ఉన్నారు. వారికి కూర్చోవడానికి కుర్చీ కూడా వేయకుండా నేలపైన కూర్చోబెట్టారు.
[zombify_post]