మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపరంగా పోరాడుతానని ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు.
ఆదివారం రోజు జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ… బండారు లాంటి చీడపురుగులను ఏరి పారేయాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశం మహిళలను ఒక్క మాట అనాలంటే భయపడాల్సిన పరిస్థితి రావాలన్నారు. తనను అన్ని మాటలు అన్న రోజునే తన భర్తను చెప్పుతో కొట్టి ఉంటే మరోసారి ఇలాంటి ఆలోచన రాకుండా ఉంటుందని బండారు భార్యను అడిగారు.
” మహిళలను కించపరిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. చంద్రబాబు జైలుకెళ్లడంతో టీడీపీ నేతలకు పిచ్చెక్కింది. చంద్రబాబు ఏ తప్పు చేయకుంటే ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? టీడీపీ ఫెయిల్యూర్ ను డైవర్ట్ చేయడానినే నన్ను టార్గెట్ చేశారు. టీడీపీ, జనసేనలకు దిగజారుడు రాజకీయాలే తెలుసు”. అంటూ రోజా మండిపడ్డారు.
This post was created with our nice and easy submission form. Create your post!