తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాత్రి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమర్పించనున్నారు. సాయంత్రం 6.15 నుండి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు.