వివాహమై ఆరు నెలలైంది. కాపురం సక్రమంగా సాగుతున్న తరుణంలో ఆ వివాహిత జ్వరంతో మృతి చెందింది. ఈ ఘటన మండలంలో జరిగింది.
- గుమ్మలక్ష్మీపురం, : వివాహమై ఆరు నెలలైంది. కాపురం సక్రమంగా సాగుతున్న తరుణంలో ఆ వివాహిత జ్వరంతో మృతి చెందింది. ఈ ఘటన మండలంలో జరిగింది. ఒడిశా రాష్ట్రం కటికి గ్రామానికి చెందిన తులసి(24)కి జ్వరం రావడంతో ఆర్ఎంపీ వైద్యులకు చూపించారు. మలేరియా నిర్ధారణ కావడంతో మందులు వాడుతున్నారు. శనివారం అర్ధరాత్రి గట్టిగా కేకలు వేయడంతో భర్త రవికుమార్ ఆదివారం కురుపాం మండలం నీలకంఠాపురం పీహెచ్సీకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి భద్రగిరి సీహెచ్సీకి తీసుకెళ్లేసరికి మృతి చెందినట్లు వైద్యులు రాజన్ తెలిపారు.
[zombify_post]