కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకలవ్య ఆదర్శ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు అందించే మోనూకు చెల్లించే మొత్తాన్ని పెంచారు. ఒక్కో విద్యార్థికి నెలకు రూ.2,205 వంతున నిధులు విడుదల చేస్తున్నారు. ఈ మొత్తంతో ఏదైనా అదనపు పోషకాహారం అందిస్తున్నారా అంటే కేవలం చిక్కీలను మాత్రమే సమకూర్చారు. నిధులు పెంచినందున కనీసం వారానికి ఒకసారైనా మెరుగైన ఆహారం అందివచ్చని భావించామని, అందుకు భిన్నంగా ఉందని కొందరు ప్రధానాచార్యులే చెబుతున్నారు. ఆహార ప్రణాళిక (మెనూను మార్చాలనే వాదన వినిపిస్తోంది.
రాష్ట్రంలో గిరిజన సంక్షేమ గురుకుల సొసైటీ పాఠశాలలు నిర్వహిస్తోంది. గతంలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నెలకు రూ.1,400, ప్లస్ ఒన్, ప్లస్ టూ (ఇంటర్మీడియట్ స్థాయి) లో నెలకు రూ.1600 మంజూరు చేసేవారు. ఇప్పుడు తరగతితో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి రూ.2,205కు పెంచారు. అంటే విద్యార్థికి రూ.605 నుంచి రూ. 805 వరకు పెంపు ఉన్నందున బలవర్ధక ఆహారాన్ని అందించే అవకాశముంది.
| ప్రస్తుత ప్రణాళిక ఇదీ"
రోజూ ఉదయం పాలు, రాత్రి పండు, వారానికి ఆరు గుడ్లు, రెండుసార్లు కోడికూర, రోజూ ఉదయం, మధ్యాహ్న భోజనానికి మధ్య వేరుసెనగతో తయారు చేసిన చిక్కీని ఇస్తున్నారు.
ఆహార ఛార్జీలు పెంచిన తర్వాత న్యూట్రిబార్ అని కొత్తగా ఇస్తున్నారు. ఇందులో చిరుధాన్యాలు ఉంటాయి. దీనికి కిలోకు రూ.520 చెల్లిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు పది గ్రాములు ఉండే బార్ను ఇస్తారు. అంటే రోజుకు రూ.5.20 ఖర్చవుతుంది.
ప్రస్తుతం ఇస్తున్న వేరుసెనగ చిక్కీలు ఒకటి కాకుండా రెండు ఇస్తారు. వీటికి కిలోకు రూ.180 చెల్లిస్తున్నారు. ఇది కూడా పది గ్రాములే ఉంటుంది.
రెండు చిక్కీలకు రోజుకు రూ.3.60 వెచ్చిస్తున్నారు.
నెలకు చిక్కీలు, న్యూట్రిబార్లపై రూ.264 ఒక్కో విద్యార్థికి చెల్లిస్తున్నారు.
• పెంచిన మొత్తంలో ఇంకా రూ.500కు పైగా ఉంటుంది. వీటితో ఏం ఇస్తారు? ఎలా ఇస్తారు? అనేది ఎక్కడా లేదు.
న్యూట్రిబార్ ధర ఎక్కువగా ఉందనే విమర్శలు తలెత్తుతున్నాయి. కేంద్రీకృత టెండర్లు విధానంలో వీటిని కొనుగోలు చేస్తున్నారు.
[zombify_post]