పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో రామస్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం అర్చక స్వాములు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆశీర్వచన మండపంలో విశ్వక్సేనారాధన, పుణ్యావచనం తదితర కార్యక్రమాలను అర్చక స్వాములు నిర్వహించారు. ఈనెల 17 నుంచి 27 వరకూ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఇఓ కిషోర్ కుమార్ వెల్లడించారు.
[zombify_post]