వ్యవసాయ కార్మిక సంఘం మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి పురం అప్పారావు కోరారు. నెల్లిమర్ల అమర వీరుల భవనం వద్ద ఆదివారం మహాసభల గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25, 26, 27 తేదీలలో బాపట్లలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు తాళాడ సన్నిబాబు, మొయిద పాపారావు పాల్గొన్నారు.;
[zombify_post]