విజయనగరం: 22 వ డివిజన్ డక్కినివీధి సీతరామ మందిరం వద్ద డక్కినివీధి యువసేన ఆధ్వర్యంలో ఆదివారం మట్టి గణపతులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, జిల్లా వైఎస్సార్ పార్టీ నాయకులు పిళ్ళా విజయకుమార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, యువసేన చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఆలయ నిర్వహకులు రౌతు వెంకటరమణ, రౌతు చంటి, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]