గురు న్యూస్ విశాఖపట్నం : స్కిల్ డెవలప్మెంట్ పై వస్తున్న తప్పుడు ఆరోపణలపై స్పందించారు, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్. అయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కి ఆంధ్రప్రదేశ్ ఒక కేంద్రం కావాలని అభిలషించారు. ఏపీలో శిక్షణ తీసుకొని ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందిపుచ్చుకోవాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల నిపుణులు అందించేందుకు శిక్షణ ఇచ్చే బ్రాండ్ అంబాసిడర్ ఏపీ కావాలని ఆయన కోరుకున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కియా. మేము ఏపీ ప్రభుత్వం లక్ష్యాలు, కృషి చూసి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాం. – అని అయన అన్నారు.2021లో సీమెన్స్ ప్రాజెక్ట్ అద్భుతం అని వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చారు, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అంతా బోగస్ అంటున్నారు. ఇది ఎలా ఉంది అంటే, ఒక వ్యక్తిని నీ పక్కనే పెట్టుకుని, ఆ వ్యక్తి చనిపోయాడని మర్డర్ కేసు పెట్టినట్టు ఉంది, అని సీమేన్స్ మాజీ ఎండి సుమన్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
[zombify_post]