in , , , ,

తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే..!

  • తెలంగాణ సాయుధ  పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే..!

  • బిజెపి,బిఆర్ఎస్ లకు సాయుధ పోరాటంతోఏం సంబంధం  లేదు.

  • కమ్యూనిస్టుల పోరాట ఫలితం, త్యాగం, అమరత్వం తోతెలంగాణ కు విముక్తి..

  • తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ బహిరంగ సభలో..

  • –సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి.

  • సూర్యాపేట:తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి  అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ ముందు ఏర్పాటుచేసిన  తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై  ఆమె మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన పోరాటం మూలంగానే ప్రజలకు దోపిడీ, పీడనల నుండి విముక్తి కలిగిందన్నరు.నిజాం పాలనలో భూములన్నీ దొరలు,జాగీర్దార్లు, జమీందార్ల చేతుల్లో ఉండేవని,వారికి వ్యతిరేకంగా భూమి,భుక్తి,వెట్టిచాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధ పోరాటం సాగించి లక్షలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేసిందన్నారు.

  • సాయుధ పోరాటానికి ఎలాంటి సంబంధంలేని బీజేపీ వాస్తవ చరిత్రను వక్రీకరిస్తోందని విమర్శించారు.
    పుచ్చలపల్లి సుందరయ్య,రావి నారాయణ రెడ్డి,భీంరెెడ్డి నర్సింహ్మ రెడ్డి, మల్లు స్వరాజ్యం లాంటి కమ్యూనిస్టుల యోధులు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారన్నారు. సాయుధ పోరాటానికి సంబంధం లేని బీజేపీ ఆ పోరాటాన్ని హిందూ, ముస్లింల పోరాటంగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. ఆనాడు పల్లెల్లో దొరలు జమిందార్లు చేస్తున్న ఆగడాలను ఎదిరించి పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టు లదేనని అన్నారు.ఎన్నికల్లో ఓట్ల కోసం హిందూ మతాన్ని రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ప్రజలు  అధిక ధరలు, నిరుద్యోగం,రైతులకు మద్దతు ధర,రాజ్యాంగ పరిరక్షణ,మహిళా రిజర్వేషన్లు,విద్య,వైద్యం,ఉపాధి అవకాశాలపై పోరాటాలు సాగించాలని ప్రజలను కోరారు.
    వెట్టిచాకిరీ నుండి విముక్తి కల్పించడం కోసం ఆనాడు నిజాం నవాబును తరిమికొట్టిన స్ఫూర్తితో దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న మోడీని గద్దె దించేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.
    నిజాం లొంగిపోయేలా పోరాడిన కమ్యూనిస్టుల త్యాగాలను గుర్తించకుండా బీజేపీ,కాంగ్రెస్‌,బీఆర్‌ఎస్‌ వంటి పార్టీలు తామేదో చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాయన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటానికి బిజెపి,బిఆర్ఎస్ తెలంగాణ పార్టీలకు సంబంధం లేదన్నారు. కమ్యూనిస్టులు నిర్వహించిన పోరాట ఫలితంగా పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి ఇచ్చిన ఘనత కమ్యూనిస్టులకే దక్కిందన్నారు.ఈ పోరాటంలో నాలుగు వేల మందిబలిదానంతో తెలంగాణ విముక్తి అయిందన్నారు. 3000 గ్రామాలకు వెట్టి నుండి విముక్తి అయ్యాయని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగాప్రజలంతా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివారించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కోలిశెట్టి యాదగిరిరావు, మట్టి పెళ్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి,కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు దండ వెంకటరెడ్డి, ఎల్గూరి గోవింద్ జిల్లా పల్లి నరసింహారావు, మేకన బోయిన శేఖర్ ,వీరబోయిన రవి ,కొప్పుల రజిత,మేకన బోయిన సైదమ్మ,కoదాల శంకర్ రెడ్డి, పులుసు సత్యం, చిన్న పంగ నరసయ్య, ఆత్మకూర్ (ఎస్ ), సూర్యాపేట రూరల్, టూ టౌన్ మండల పట్టణ కార్యదర్శి అవిరే అప్పయ్య, మారం చంద్రారెడ్డి, బత్తుల వెంకన్నతదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినోత్సవమే

రెంటచింతలలో టిడిపి ఆధ్వర్యంలో మేము సైతం బాబు వెంటే