పాలకులు మంచి వారైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారనేది సత్యం.ఇది ఎల్లారెడ్డి పేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఇది అక్షర సత్యం అని నిరూపించారు. ఎల్లారెడ్డిపేట గ్రామాన్ని ఇటీవల కేంద్ర పరిశీలన బృందం గ్రామంలో విస్తృతంగా పర్యటించింది. గ్రామంలో గల అన్ని మౌళిక వసతుల ను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్ర బృందం వెళ్ళింది.కాగ రాజన్న సిరిసిల్ల జిల్లా లో గల గ్రామ పంచాయతీ లలో కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుకు ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ నీ ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.ఇట్టి అవార్డును శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అనురాగ్ జయంతి చేతుల మీదుగా సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మరియు పాలకవర్గం అందుకోనున్నారు.ఇటీవల మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకోగా అంతే కాకుండా ఇటీవల జాతీయ స్థాయిలో ఉత్తమ సామాజిక సేవా కార్యకర్త అవార్డు ను ఢిల్లీలో సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి అందుకోగా తాజాగా కేంద్ర స్వచ్ఛ సర్వే క్షణ అవార్డు కు ఎల్లారెడ్డి పేట గ్రామ పంచాయితీ ఎంపిక కావడం విశేషం.హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు.
[zombify_post]