రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన దొడ్ల సంజీవ్ అనే ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డును గురుపూజోత్సవం రోజు అందుకున్న సందర్భంగా సోమవారం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్కండేయ దేవాలయంలో ఘనంగా శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ తమ కుల బాంధవుడైన సంజీవ్ కు ఉత్తమ ఉపాధ్యాయినిగా అవార్డు రావడం చాలా సంతోషమని అన్నారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా, ఉత్తములుగా తీర్చిదిద్దే అవకాశం ఒక్క ఉపాధ్యాయునికి మాత్రమే ఉందని అలాంటి వారిని సన్మానించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వనం బొందయ్య, తో పాటు పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు.

[zombify_post]