- పార్టీ ఆధ్వర్యంలో తుక్కుగూడలో నిర్వహిస్తున్న విజయసభకు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఎల్లారెడ్డిపేట పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల నుండి తుక్కుగూడ లో ఆదివారం జరిగే విజయసభకు అందరూ భారీ ఎత్తున అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన సోనియా గాంధీకి అందరం రుణపడి ఉన్నామని ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి రుణం తీర్చుకోవాలన్నారు. రానున్న ఎన్నికల్లో 5రకాల గ్యారెంటీ కార్డును సోనియా గాంధీ ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. రైతు రుణమాఫీ,4000/ వేల పెన్షన్ , 500 లకే సిలిండర్ తదితర అంశాలతో ప్రజల ముందటికి గ్యారెంటీ కార్డును తీసుకురావడం జరుగుతుందన్నారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, నాయకులు దొమ్మాటి నరసయ్య, అనవేణి రవి, సోనవేని రాజయ్య, బాలయ్య, భూమి రెడ్డి, కటిక రవి, గుడ్ల శ్రీనివాస్, దండు శ్రీనివాస్, మేడిపల్లి రవీందర్, ఎస్.కె గఫార్, ఎండి ఇమామ్, సిరిపురం మహేందర్, చెరుకు ఎల్లయ్య, వంగ మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, నరేందర్ ,చెన్ని బాబు, గంట బుచ్చ గౌడ్, ఎండి రఫీక్ , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]