in ,

పర్యాటక కేంద్రాలలో మట్టి పాత్రల స్టాల్స్ ఏర్పాటుకు ప్రోత్సాహం

పాడేరు, అల్లూరి జిల్లా:- జిల్లా పర్యటనకు వచ్చిన కుమ్మరి/శాలివాహన కార్పోరేషన్ చైర్మన్ మండేపూడి పురుషోత్తం జిల్లా కల్లెక్టర్ సుమిత్ కుమార్ ను గురువారం కలెక్టర్ చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలివాహన కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమలుపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో నమ్మకంతో తనకు కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కుమ్మరి, శాలివాహన ప్రజల శ్రేయస్సుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. చేదోడు పథకం కుండలు తయారుచేసే వారికీ కూడా వర్తింప చేయాలని ముఖ్యమoత్రిని కోరామని, త్వరలో నే కుమ్మరి వృతివారికి కూడా చేదోడు పథకం కింద రూ. 10 వేలు ఆర్ధిక సహాయం అందించే అవకాశం ఉందని అన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉన్నందున మట్టి పాత్రలు తయారు చేసే వారికి, మట్టి పాత్రల స్టాల్స్ ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తామని చైర్మన్ కు కలెక్టర్ హామీ ఇచ్చారు.
జిల్లాలో నలుగురు సభ్యులతో కుమ్మరి, శాలివాహన సంక్షేమ కమిటీ
జిల్లాలో నలుగురు సభ్యులతో కుమ్మరి, శాలివాహన సంక్షేమ కమిటీ ఏర్పాటైనట్లు ఆ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మండేపూడి పురుషోత్తం వెల్లడించారు. జిల్లాలో కలెక్టర్ అద్యక్షతన ఏర్పటయ్యే అధికారిక కమిటిలో జిల్లా ఎస్పీ, జిల్లా సహకార అధికారి, డిఆర్డిఎ ప్రాజెక్ట్ అధికారి, జిల్లా పంచాయతి అధికారి సభ్యులుగా ఉంటారని, అదేవిధంగా జిల్లాకు చెందిన కుమ్మరి/శాలివాహన సి.ఎస్.ఎఫ్ లిమిటెడ్ డైరెక్టర్ ఒక సభ్యునిగా ఉంటారని, బిసి సంక్షేమ శాఖాధికారి మెంబర్- కన్వీనర్ గా ఉంటారని, వీరితో పాటు కలెక్టర్ ఎంపిక చేసిన కుమ్మరి/శాలివాహన వృత్తికి చెందిన నలుగురు వ్యక్తులు కూడా సభ్యులుగా ఉంటారని చైర్మన్ వివరించారు.  ఈ సందర్భంగా పాడేరు నియోజకవర్గం నుండి శ్రీకాకుళపు వరలక్ష్మి, శ్రీకాకుళపు అప్పారావు,  రంపచోడవరం నియోజకవర్గం నుండి మోదుoపురుపు ఈశ్వర్ తేజ, అరకు నియోజకవర్గం నుండి రెల్లి వెంకటేష్ లను సభ్యులుగా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కుమ్మరి/శాలివాహన సంక్షేమ కార్పోరేషన్ చైర్మన్ తో పాటు కుమ్మరి/శాలివాహన సంక్షేమ కార్పోరేషన్ రాష్ట్ర  డైరెక్టర్ వెంకట రావు, బిసి సంక్షేమ శాఖాధికారి రాజేశ్వరి, శాలివాహన సంక్షేమ కార్పోరేషన్ జిల్లా సభ్యులు  శ్రీకాకుళపు వరలక్ష్మి, శ్రీకాకుళపు అప్పారావు,  మోదుoపురుపు ఈశ్వర్ తేజ, రెల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ప్రతి గడపలోనూ సంక్షేమ వెలుగులు: పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి

ఖమ్మం జిల్లా మంత్రి హరీశ్ రావు పర్యటనపై భట్టి హాట్ కామెంట్స్