in ,

జగన్ పాలనకు దేశమంతటా ప్రశంసలు- ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

అల్లూరిసీతారామరాజు జిల్లా
పాడేరు నియోజకవర్గం: జగనన్నపాలనకు
దేశమంతటా ప్రశంసలు లభిస్తున్నాయని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి అన్నారు. పాడేరు మండలం చింతలవీధి గ్రామ సచివాలయం పరిధిలోని మంగళవారం గడప గడపకు  మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 272 గడపలను సందర్శించి ప్రజా సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా ఈ నాలుగున్నరేళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించిన ఆర్థిక సాయం గణంకాలతో సహా వివరించారు. స్థానికులు తెలియజేసిన సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 73 ఏళ్లు ఒకలా ఉంటే  ఈ నాలుగేళ్లు మరో రకమని ఆమె అన్నారు. 73 ఏళ్ల పాటు చూడని అభివృద్ధిని ఈ నాలుగేళ్లలోని ఆంధ్రప్రదేశ్‌లో చూడగలుగుతున్నామన్నారు. ఇదివరకు పేదలు ఎవరూ పొందని సంక్షేమ ఫలాలను ఈ నాలుగున్నరేళ్లలోనే పొందారని తెలిపారు. పేదల ఆర్థిక సామర్ధ్యాలను పెంచే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఆర్థిక సామర్థ్యాలు పెరిగాయని వారి కొనుగోలు శక్తి కూడా భారీగా పెరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వంతల సీతమ్మ , వైస్ సర్పంచ్ తామర సురేష్ , ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి సీదరి మంగ్లన్న దొర, వ్యవసాయ సలహా మండల చైర్మన్ సరస్వతి, మండల అధ్యక్షులు సీదరి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ కూతంగి సూరిబాబు, జిల్లా పంచాయతీ విభాగం అధ్యక్షులు గబ్బాడి చిట్టిబాబు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ , సర్పంచులువంతల రాంబాబు, గొల్లోరి నీలకంఠం , ఎంపీటీసీలు  కుంతూరు నరసింహమూర్తి, లకే రామకృష్ణ పాత్రుడు, చల్లా చిట్టెమ్మ, దూసురి సన్యాసిరావు, సచివాలయం కన్వీనర్లు మినుముల కన్నాపాత్రుడు, గబ్బాడ రాజారావు , వంతల నరేష్ , కోడా సుశీల, మండల ఉపాధ్యక్షులు పసుపుల సత్యనారాయణ ,సీనియర్ నాయకులు కుంతూరు రాజబాబు, బోనంగి రమణ, సోమెల బోడిరాజు, కొండాజీ, నాని ,కొండమ్మ, అల్లాడ నగేష్, మోద బాబురావు ,పిట్ట నవీన్ అధికారులు, సచివాలయ సిబ్బంది కన్వీనర్లు ,వాలంటీర్లు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

నా మట్టి నా దేశం కార్యక్రమం.