in , ,

బోరున వర్షంలోనే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

పాడేరు నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా:  ఒకపక్క బోరున వర్షం కురుస్తున్నా దానిని లెక్కచేయకుండా విశేష ప్రజాదరణ మధ్య గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పాడేరు శాసనసభ్యులు  భాగ్యలక్ష్మి బుధవారం నిర్వహించారు. జీకే వీధి మండలం దారకొండ గ్రామ సచివాలయం పరిధిలోని పీట్రాయి, పెద్ద గంగవరం, చిన్న గంగవరం, నరమామిడి గొంది, రోలుగుంట , తోటనగరం,   చెక్కల మద్ది,  నిమ్మచెట్టు  గ్రామాలలో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం శాసనసభ్యులు  కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గడపగడపకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని వ్యక్తిగతంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 285 గడపలను భాగ్యలక్ష్మి  సందర్శించారు. నాలుగున్నరేళ్ల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేసినటువంటి మేలును వివరించారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే గ్రామ సచివాలయాల్లో సంప్రదించాలని సూచించారు. స్థానికులు తెలియజేసిన సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి  మాట్లాడుతూ సంక్షేమంతోనే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని నవరత్నాల పథకాలతో నిరూపితమైందని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో ప్రణాళిక బద్ధంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వలన ప్రతి గడపలోనూ ప్రతి పేదవాడు ఆర్థిక సాయం పొందగలుగుతున్నారన్నారు. ఒకే కుటుంబంలో ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఐదు నుంచి ఏడు లక్షల వరకు సాయం పొందిన పరిస్థితులు చాలా కుటుంబాల్లో ఉన్నాయన్నారు. సంక్షేమ పథకాల ద్వారా వచ్చే ఆర్థిక వెసులుబాటు వలన కొనుగోలు సామర్థ్యం పేదవారిలో పెరుగుతుందన్నారు. గతం కంటే ఉన్నతమైన జీవనం సాగించేందుకు ప్రజలకు బడుగు బలహీన వర్గాల వారికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్  ఎన్ రాజు, ఎం పి టి సి ఎం.రామన్న పిలా బుజ్జి, జి రామయ్య, పి సాంబమూర్తి, మండల ప్రెసిడెంట్ బొబ్బిలి లక్ష్మణ్, ఎంపీపీ బోయిన కుమారి, ఏఎంసీ చైర్మన్ ఎం మత్స్యరాజు, సర్పంచులు ఎం కమలమ్మ, పి దుర్గా, పి వంశీకృష్ణ , కె రాంబాబు, ఎంపీటీసీలు ఎం సత్యనారాయణ, పి నాగమణి, పీలా సాంబమూర్తి, సిహెచ్ ఆనంద్ (వైస్ ఎంపీపీ) సీనియర్ నాయకులు కే గిరిప్రసాద్, కే రామ్ రాజ్, ఆర్ మోహన్ రావు , అంజి  లోవరాజు, సోషల్ మీడియా కన్వీనర్ అల్లాడ నగేష్, పి ఎస్ ఎస్ చైర్మన్ వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

ఎల్లారెడ్డిపేట మండల రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ ఏర్పాటు*

పరమేశ్వరి ఉత్సవాలు జరుపుకునేందుకు మండపం*