అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయితీ,సంగం వలస గ్రామంలో కొట్టుకుపోయిన కల్వర్టును గ్రామస్థులతో పరిశీలించి కల్వర్టు మరియు రోడ్డు మంజూరు చేసి నిర్మాణం చేయాలి లక్ష్మీపురం సర్పంచ్ కొర్ర త్రినాధ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం సర్పంచ్ కొర్ర త్రినాధ్ మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూడు సంవత్సరం క్రితం నిర్మించిన కల్వర్టు కోటుకోపోయిందన్నారు. ఇవతల పాఠశాల ఉండడంతో విద్యార్దులు గెడ్డ దాటలేక మూడు రోజుల పాటు పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయుడు పాఠశాలకు వచ్చిన పలితం లేదన్నారు, అలాగే గ్రామస్తులు నిత్యవసర వస్తువులకు,అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెలాలంటే నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ంఈ విషయం పై గతంలో అనేక సార్లు స్పందనలో కలెక్టర్లు, ఐటీడీఏ పీవో వినతి పత్రం అందజేసిన స్పందించలేదన్నారు. , ఇప్పటీకైన ఎమ్మెల్యే సంభందిత అదికారులు స్పందించి కొట్టుకుపోయిన కల్వర్టు, రోడ్డు మంజూరు చేసి నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు,ఇందులో వార్డు సభ్యుడు ఎ.అనంతరం,గ్రామస్థులు ఏ.మహేష్, కే.నాగరాజు, తదితులున్నారు,
[zombify_post]