రాజన్న సిరిసిల్ల జిల్లా : బుధవారం హైదరాబాద్ లో నిరుద్యోగులకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చేపట్టినటువంటి ఉపవాస దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసినందుకు నిరసనగా గురువారం గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మండల శాఖ ఆధ్వర్యంలో కండ్లకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా ఉపవాస దీక్ష చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్మనపల్లి దేవయ్య, ఓబీసీ జిల్లా సెక్రెటరీ మేకప్తి శ్రీనివాస్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి నల్ల రాజ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు మద్దుల రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు దోమకొండ కృష్ణకాంత్ యాదవ్, మహేష్, శనిగరం సర్వోత్తమ్, ఓబిసి మండల అధ్యక్షుడు మురళీమోహన్ గౌడ్, ఓబీసీ ఉపాధ్యక్షుడు కుర్ల దేవరాజు, ఓ బి సి మండల ప్రధాన కార్యదర్శి బోదాసు స్వామి, నర్మాల ఎల్లయ్య, సీనియర్ నాయకుడు దేవరాజు గౌడ్, పొన్నాల మహేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.*కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపిన బిజెపి నాయకులు*
[zombify_post]