రెంటచింతల మండల కేంద్రంలో ఆదివారం ఫ్రెండ్స్ ఇన్ నీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కార్యాలయంలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం బ్రోచరును విడుదల చేశారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించనున్నారని వారు తెలిపారు. ఆరవ విడత చేపట్టనున్న ఈ కార్యక్రమంలో సుమారు 2000 విగ్రహాలు పంపిణీ చేయనున్నట్లు వారు వివరించారు. మాజీ జెడ్పిటిసి నవులూరి భాస్కర్ రెడ్డి, వెన్న వెంకటేశ్వర రెడ్డి, గొట్టం బ్రహ్మారెడ్డిలు విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ఆర్థిక సాయం అందించాలని సభ్యులు వివరించారు.
[zombify_post]