బాల్య వివాహాల నిషేధ చట్టం 2006పై అవగాహన సమావేశం మాచర్ల పట్టణంలోని మానుకొండ కళ్యాణ మండపంలో గురువారం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి బాలల హక్కుల చట్టంపై అవగాహన కల్పించారు. బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు అనంతరం ఎమ్మెల్యే పి ఆర్ కె తో పాటు కమిషన్ సభ్యులు బత్తుల పద్మావతి, మున్సిపల్ చైర్మన్ మాచర్ల చిన్న ఏసోబు ను మాచర్ల మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాచర్ల ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు పురపాలక సంఘ ఉద్యోగులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
[zombify_post]