కొవ్వూరు తూర్పు గోదావరి జిల్లా:
ప్రజా సమస్యలు సత్వర పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న కు చెబుదాం 1902 కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారని ప్రజలు తమ సమస్యలు పరిష్కార దిశగా సద్వినయోగం చేసుకోవాలని రాష్ట్ర హోంత్రి డా.తానేటి వనిత పేర్కొన్నారు.
స్థానిక యువరాజ్ ఫంక్షన్ హాల్లో కొవ్వూరు మండలస్థాయి జేకేసి కార్యాక్రమానికి హోం మంత్రి డా. తానేటి వనిత ముఖ్యఅతిధి గా పాల్గొన్నారు. కార్యక్రామాన్ని జిల్లా కలెక్టర్ మాధవీలత అధ్యక్షతన నిర్వహించగా కార్యక్రమంలో జాయింట్ కలెక్టరు తేజ్ భరత్, ఆర్డీవో ఎస్. మల్లి బాబు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యతనిస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మండల స్థాయి లోనే సమస్యల పరిష్కారంచూపేందుకు చిత్త శుద్దితో అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. మరో వైపు గడప గడపకు మన కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చెయ్యడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్య పరిష్కారం కోసం నేడు మండల స్థాయి లో జేకేసిని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు హాజరవ్వడం జరిగిందన్నారు. మండల స్థాయిలోనే రెవెన్యూ, భూ సంబంధ సమస్యలకు తక్షణమే పరిష్కారం అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎంపి మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కరించే దిశగా ముఖ్యంమంత్రి జేకేసీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారన్నారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కారం నిమిత్తం జిల్లా కేంద్రాలకు రాకుండా మీకు అందుబాటులో ఉన్న మండల కార్యాలయాల్లోనే పరిష్కరించండం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్య క్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందనన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా అందిన అర్జీలను పూర్తి నాణ్యత తో పరిష్కరించాలనన్నారు. ప్రజా సమస్యలపరిష్కారం నిమిత్తం జిల్లా స్థాయి లో స్పందన కార్యక్రమాన్ని నిర్వస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి బుధ, శుక్ర వారాలలో మండల స్థాయి లో జగనన్న కు చెబుదాం కార్యక్రమ నిర్వహణ ద్వారా సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో తొలుత జేకేసీ కార్యక్రమాన్ని గోపాలపురం నియోజక వర్గం గోపాలపురం మండల కేంద్రం నుండి ప్రారంభించారని తెలిపారు. అర్జీదారుల సమస్యల ను క్షేత్రస్థాయి లోపరిశీలించి నాణ్యతతో నిర్ణీత గడువు లోపల పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించి జెకేసీ కార్యక్రమంలో రెవెన్యూ, భూ సంబంధ, హౌసింగ్, డ్రైనేజ్ నిర్వహణ తదితర శాఖల కు చెందిన 109 అర్జీలను స్వీకరించామని పేర్కొన్నారు.
జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ ప్రతి అర్జీ వారం రోజుల లోగా పరిష్కారం చూపడం జరుగుతుందని అన్నారు. ఆమేరకు ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. ఈరోజు స్వీకరించిన అర్జీలను ఆన్లైన్ లో నమోదు చెయ్యడం తో పాటు వాటి తదుపరి పరిష్కార చర్యల ప్రగతిని పర్యవేక్షణ చేసేందుకు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించినట్లు తెలిపారు. అర్జీలను వారంలోగా పరిష్కరించలేని యడల డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారి సిబ్బంది వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్న కుమా రి, మునిసిపల్ కమీషన ర్, బి. శ్రీకాంత్, యం. పి. పి., కాకర్ల నారాయణుడు, డ్వా మా పి. డి. పి జగదాంబ,డియంహెచ్ఓ డా. కె.వేంకటేశ్వరరావు, సీపీఓ ఎ. ముఖలింగం, జిల్లా వ్యవ సాయ శాఖ అధికారి ఎస్. మాధవరావు, డీటీవో ఎన్. సత్యనారాయణ, డీఈఓ ఎస్ అబ్రహం,ఎల్డీయం డీబీ ప్రసాద్, హౌసింగ్ పిడి, పరశురామ్, డిఓహెచ్ఓ ఎస్టీజీ సత్యగో విందం, డీసీహెచ్ ఓ డా. ఎన్. సనత్ కుమారి, డిఎంహెచ్ఓ డా. కె.వెంకటేశ్వరరావు పలువురు జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]