-
కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లా: ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఒక రాజకీయ నేతగా పాలన అందించడం కాకుండా మనసున్న నేతగా, మానవతావాధిగా పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గంలో చాగల్లు మండలం నెలటూరు సీతారామ కళ్యాణ మండపంలో, కొవ్వూరు టౌన్ లో మున్సిపల్ కార్యాలయంలో ఫేజ్ 2 క్రింద కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి చాగల్లు మండలంలో 359 మందికి, కొవ్వూరు టౌన్ లో 127 మందికి మొత్తం 476 మందికి హోంమంత్రి స్వయంగా అందజేశారు..
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా పథకాల లబ్ధి అందని వారు ఉంటే గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా జల్లెడ పట్టి మరీ వెతికి వారికి కూడా లబ్ధిని అందజేస్తుమన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఉందని.. ఇది ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విజనరీకి తార్కాణమని ఆమె కొనియాడారు. గత ప్రభుత్వంలో రూ.1000 ఉన్న పెన్షన్ ప్రస్తుతం రూ.2750కి పెంచి ఇస్తున్నామన్నారు. ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు వేస్తే.. ఆయన బిడ్డగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేయడానికి నాలుగు అడుగులు ముందేకేస్తున్నారని తెలిపారు. వివిధ కారణాల వల్ల పథకాలు అందుకోలేకపోయిన వారికి కూడా లబ్ధి చేకూర్చాలని.. ఏ ఒక్కరూ మిస్ కాకూడదని జల్లెడ పట్టి మరీ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలను రూపుదిద్ది అమలు చేశామని హోంమంత్రి తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఇంటింటా ప్రతీ ఒక్కరికీ మంచి జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో 2014 – 19 కాలంలో సగటున నెలకు ఖర్చు చేసింది కేవలం రూ. 400 కోట్లు మాత్రమేనని.. జగనన్న ప్రభుత్వంలో జూన్ 2019 దాదాపు మూడున్నర రెట్లు పెంపు రూ. 1,350 కోట్లు, జనవరి 2022 దాదాపు నాలుగు రెట్లు పెంపు రూ. 1,570 కోట్లు, జనవరి 2023 దాదాపు నాలుగున్నర రెట్లు పెంపు రూ. 1,800 కోట్లును అందిస్తున్నామని తానేటి వనిత వివరించారు. గతంలో ఉన్న కోటాలు, కోతలు, వీలైనంత మందికి ఎలా ఆలోచనలు లేవనన్నారు. కులం, మతం, వర్గం, ఏ పార్టీ అనేది కూడా చూడకుండా నూటికి నూరు శాతం సంతృప్త స్ధాయిలో పెన్షన్లు అందిస్తున్నామన్నారు. గతంలోలా లంచాలు, వివక్ష, మధ్య దళారీలు, బ్రోకర్లు, పక్షపాత జన్మభూమి కమిటీలు వంటివి లేవన్నారు. ప్రతి నెలా మొదటి రోజే అది ఆదివారమైనా, సెలవుదినమైనా మీ గడప ముందుకొచ్చి వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్నామని.. అలాగే ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా, కుటుంబ పెద్దగా సీఎం బాధ్యతలు తీసుకుని అండగా నిలుస్తున్నారని తెలిపారు. గత పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకు మధ్య తేడాలను ప్రజలు గమనించి.. జగనన్న ప్రభుత్వానికి మరొక్కసారి మీ చల్లని దీవెనలతో ఆశీర్వాదించాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు.
[zombify_post]
