టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్
ప్టెంబర్ 17వ తేదీన సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ లో జరిగే కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సోమవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్. ఈ సభలో సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఐదు గ్యారంటీ పథకాలను హామీ పత్రం రూపంలో ప్రకటించినట్లు మానవతారాయ్ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యే బహిరంగ సభకు టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో కదులుతున్నట్లు మానవతారాయ్ వెల్లడించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 289 బూతుల నుంచి కాంగ్రెస్ శ్రేణులను తరలిస్తున్నట్లు మానవతారాయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రావి నాగేశ్వరరావు, దేశిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఐ కృష్ణ, మందలపు శ్రీనివాస్ రెడ్డి, మేడ విజయ్ బాబు, పజల్ రెహమాన్ బాబా, పసల ఏడుకొండలు, గండ్ర జగన్మోహన్ రెడ్డి, నీలపాల రామారావు, వెల్లంపల్లి ఏడుకొండలు, కొమ్మేపల్లి యాకూబ్, గుర్రాల దేవ ప్రియుడు, నందికోలా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
