in , ,

ఆధారాలు ఉంటే లోకేష్ నైనా అరెస్టు చేస్తాం: హోంమంత్రి వనిత

  • విశాఖపట్నం: తనను అరెస్ట్‌ చేయాలని లోకేష్‌ పదేపదే చెప్పనక్కర్లేదని.. నేరం రుజువైతే అరెస్ట్‌ తప్పదని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కోసం చట్టాలు, జైలు రూపొందించలేదన్నారు.జైళ్లలో అన్ని రకాల నేరస్తులు ఉంటారు. రాజమండ్రి జైలుల్లో చంద్రబాబుకు పూర్తి భద్రత కల్పించాం.. ఆయనకు ఇంటి భోజనం కూడా అందిస్తున్నారు. మావోయిస్టుల నుంచి జైలులో చంద్రబాబుకు ఏ ఇబ్బంది లేదు.. ఆయన భద్రత ప్రభుత్వం బాధ్యత. లోకేష్‌, పవన్‌, బాలకృష్ణ వారి పని వారు చేసుకోవచ్చు' అని తానేటి వనిత అన్నారు.
    ''రోడ్డెక్కి ప్రజలను రెచ్చగొడితే చర్యలు తప్పవు. చంద్రబాబు ఉన్న గది పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. చంద్రబాబు అనుమతితోనే ఎవరినైనా ఆయన వద్దకు పంపించడం జరుగుతుంది. చంద్రబాబు సామాన్య వ్యక్తి కాదు… 14 ఏళ్ల సీఎం.. సాక్ష్యాలు లేకుండా అతన్ని సీఐడీ అరెస్టు చేయదు. స్కిల్ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న సాక్ష్యాలు ఉండబట్టే ఆయన్ను సీఐడీ అరెస్టు చేసింది'' అని హోంమంతి పేర్కొన్నారు.

[zombify_post]

Report

What do you think?

విశాఖ లో టీడీపీ నాయకులు అరెస్టు

విశ్వసభలలో వివేకవాణికి 130 యేళ్ళు