డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :
ఉభయగోదావరి జిల్లాల్లో చంటిపిల్లల తల్లిగా ప్రసిద్ధిగాంచిన చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుండి సి.జి.ఎఫ్. మాచింగ్ నిధులు 1కోటి 60 లక్షల రూపాయలు మంజూరు చేయించుకోవడం జరిగింది అని బీసీ సంక్షేమ శాఖా మరియు ఐ అండ్ పి.ఆర్. మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ నూకాంబికా అమ్మవారి ఆలయం ప్రతీ ఏటా జరిగే జాతర మరియు తీర్ధ మహోత్సవాలలో సుమారు 5,00,000 మంది దర్శించుకుంటారని, అంతటి మహిమగల అమ్మవారి ఆలయం నందు ప్రాకార మండపం నిర్మాణం మరియు ముఖమండపం పునర్నిర్మాణానికి 1కోటి రూపాయలు సి.జి.ఎఫ్ నిధులు మరియు 60 లక్షల దేవస్థానం నిధులు విడుదల చేయించుకోవడం శుభపరిణామం అని అన్నారు.
[zombify_post]