డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
శారీరక మానసిక ఆరోగ్యానికి క్రీడలు దోహదపడతాయని ఆత్రేయపురం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కుండా అన్నపూర్ణ అన్నారు. స్థానిక మహత్మా గాంధీ ఎయిడెడ్ పాఠశాల ప్రాంగణంలో అండర్ 14 మరియు,17 'స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు ఆమె ప్రారంభించారు. ప్రతీ విద్యార్థి చదువుతోపాటు ఆటలలో కూడా రాణించాలని ఆమె అన్నారు. మండల అభివృద్ది అధికారి నాతి బుజ్జి మాట్లాడుతూ, వ్యక్తిత్వ వికాసానికి, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఆటల పోటీలు ఎంతో ప్రాధాన్యత వహిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు 1&2 ప్రసాదరావు, సాహెబ్, జిల్లా ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమీషనర్ (రిటైర్డ్ ) నాగేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు మురళీకృష్ణ, వ్యాయామ డైరెక్టర్లు నాగబాబు, శ్రీనివాస్, రవిరాజా, మంగాలక్షి, శోభారాణి, వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
[zombify_post]