జగిత్యాల జిల్లాలో సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాలకు, మిలాద్- ఉన్ -నబి పండుగలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ భాస్కర్ డిఎస్పీలు, సి.ఐ లు అన్ని పోలిస్టేషన్ ల ఎస్.ఐ లతో సోమవారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుపుకొనే అతి పెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేష్ వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ఘనంగా జరుపుకోవాలన్నారు. గణేష్ ఉత్సవాలు ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో, ఎస్.ఐ లు, ఇన్ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. పోలీస్ అదికారులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలన్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాలన్నారు. సీసీటీవీలపై దృష్టి సారించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలన్నారు. మండపాల్లో డిజే ఏర్పాటుకు అనుమతి లేదని మండపం నిర్వహకులు, కమిటీలకు అధికారులు వివరించి చెప్పాలని సూచించారు. గణేష్ మండపంలో రోజంతా కనీసం ఇద్దరు వాలంటీర్ లు తప్పనిసరిగా ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలని, భక్తుల సందర్శనను దృష్టిలో వుంచుకుని మండపాలలో క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మండపాల్లో షార్ట్ సర్క్యూట్ జరగకుండా నాణ్యత గల వైర్లను ఉపయోగించేలా చోరవ తీసుకొవాలని, ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో వున్న గణేష్ మండపం నిర్వాహకుల కమిటీ వివరాలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గణేష్ మండపం దగ్గర విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలని, పోలీస్ ఉన్నతాధికారులు తనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారని తెలిపారు. వినాయక మండపాల దగ్గర ఎటువంటి సమస్యలు, ఘర్షణలు లేకుండా చర్యలు చేపట్టాలని, సమస్యాత్మక ప్రాంతాలు వుంటే బందోబస్తును పెంచాలని సూచించారు. అవసరమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్ ఏర్పాటు చేయాలన్నారు. గణేష్ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా నిర్వహించడానికి పటిష్టమైన పోలీసులతో బందోబస్తు, నిమజ్జనోత్సవానికి అవసరమైన పోలీస్ బందోబస్తు, స్విమర్స్, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై సంబంధిత శాఖల సమన్నయంతో నిమజ్జనాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
[zombify_post]