in , ,

సెప్టెంబర్ 9న లోక్ అధాలత్ వినియోగించుకోవాలి-ఎస్పీ భాస్కర్

జాతీయ మెగా లోక్ అదాలత్  సెప్టెంబర్ 9న ఉన్నందున రాజీ పడ దగిన కేసులలో  క్రిమినల్ కంపౌండబుల్  కేసులు, సివిల్  తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులో, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు ఇతర రాజీ పడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు  రాజీ పడాలని జగిత్యాల జిల్లా ఎస్పీ భాస్కర్ సూచించారు. రాజీ మార్గం  రాజ మార్గమని చిన్న చిన్న  కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని డబ్బులను వృధా చేసుకోవద్దని, జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు. పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్ లు మరియు పోలీస్ సిబ్బంది రాజీ పడ్డ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Gopi

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

ఫ్యాన్ కి విద్యుత్ ప్రవహించడంతో విద్యుత్ కీగురయ్యాడు.

కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు మానుకోవాలి