జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణి నగర్ కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డా. గుర్రం దయాకర్ మరోసారి ప్రతిభ చాటాడు. గణపతి నవరాత్రుల సందర్భంగా గుండు పిన్నుపై అతి సూక్ష్మంగా మైనం తో చంద్రయాన్ 3, జీ 20 భారతదేశం జెండా పట్టుకుని నిలబడి ఉన్న గణపతిని తయారు చేశాడు. అత్యంత సూక్ష్మంగా తయారుచేసిన ఈ లంబోదరుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. పొడవు 6 ఎం ఎం వెడల్పు 4 ఎం ఎం ఉంటుందని, ఈ విగ్రహం తయారీకి 8 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు.
[zombify_post]