డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
పోలీసుల హౌస్ అరెస్టు నుండి చాకచక్యంగా తప్పించుకుని రావులపాలెం సామూహిక సత్యాగ్రహ దీక్షా శిబిరానికి కొత్తపేట నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు చేరుకున్నారు.సత్యానందరావు దీక్షకు అన్ని సంఘాల వారు మద్దతు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏనాడు తప్పు చేయలేదని అన్నారు.అలాంటి వ్యక్తిపై అవినీతి ఆరోపణలు అంటించాలని జగన్ ప్రభుత్వం చూడటం చంద్రుడిలో మచ్చను వెతకటంలాంటిదే అని అన్నారు.ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్లే నిన్న ఉదయం నుండి చంద్రబాబునాయుడుని తిప్పుతున్నారని తెలిపారు.ఇటువంటి అక్రమ అరెస్టు లు అందరూ ఖండించాలని పిలుపునిచ్చారు
[zombify_post]