తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని నిరసిస్తూ స్థానిక క్యాంప్ కార్యాలయం నుండి సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ శివారులో గల మెట్ట ఆంజనేయ స్వామి దేవాలయం వరకు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు విడుదల కావాలి అని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ద్వి చక్ర వాహనల మీద ర్యాలీ గా వెళ్లి నల్ల బ్యాడ్జీలు ధరించి సత్తుపల్లి లోని ఎన్టీఆర్ గారి కాంస్య విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోట్రు వెంకట రామారావు సరస్వతి, తిమ్మిడి రాంబాబు, వినుకొండ రమేష్, బొంతు భాస్కరరావు విజయలక్ష్మి, రమ్య, రాచర్ల చంద్రశేఖర్, చెన్న కేసవా, ధర ప్రసాద్, నిమ్మగడ్డ సత్యనారాయణ, దొడ్డ సత్యనారాయణ, కారుమంచి శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు
[zombify_post]