డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మోదుకూరు గ్రామంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం మరియు మహాశక్తి పథకం నందు అవినీతి వద్దు, వైసీపీ వద్దు, క్రైమ్ వద్దు అనే నినాదాలతో ప్రజావేదిక ఏర్పాటు చేసి సంతకాలు సేకరించి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ బండారు సత్యానందరావు ఇంటింటికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకా ప్రతి కుటుంబానికి చేకూరే లబ్దిని వివరించి, అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు హామీ పత్రాలను అందించారు. ఈసందర్భంగా బండారు మాట్లాడుతూ వైసీపీ నాలుగున్నర యేళ్ల పాలనలో మోదుకూరు అభివృద్ధికి నోచుకోలేదని, అభివృద్ధి ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని సత్యానందరావు అన్నారు. అలాగే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారెంటీ పధకాలను తీసుకొచ్చిందని అన్నారు. మహాశక్తి పధకం ద్వారా ఆడబిడ్డ నిధి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం వంటి పధకాలు మహిళల ఆర్దిక తోడ్పాటును ఇస్తాయని అన్నారు. అన్నదాతకు యేటా 20 వేలు,యువగళం నిధి ద్వారా నిరుద్యోగులకు 3 వేలు వంటి పధకాలు వంటి పధకాలు ప్రజలలో ఆదరణ పొందాయని అన్నారు.
ఈకార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
[zombify_post]