- అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ లఛ ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. పాడేరు నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, విశాఖ నుంచి పాడేరు పాల ప్యాకెట్లు తో వస్తున్న విశాఖ డెయిరీ కి చెందిన వ్యాను ఒక్కదాని కొక్కటి రాసుకుని నిలిపోయాయి. 12వ మైలు సమీపంలోని ఓ మలుపు వద్ద వ్యాను ఎదురుగా రావడంతో బస్సు డ్రైవర్ బస్సును నిలోపివేశాడు. దీంతో వ్యాను బస్సును రాసుకుంటూ నిలిచిపోయింది. ఈ ప్రమాదంవల్ల సుమారు గంటకు పైగా వాహనాలు ఘాట్ లో నిలిచిపోయాయి. ఇటీవల కాలంలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
[zombify_post]