» ఆవులు, ఎద్దులను వీధుల్లో వదిలేస్తున్న యజమానులు
» ఆకలి తీర్చుకునేందుకు మూగజీవాల ఆరాటం
» దారి పైకి వస్తుండటంతో ప్రమాదాల బారిన ప్రయాణికులు
నియోజకవర్గ కేంద్రమైన సత్తుపల్లి ప్రధాన రహదారులపై పశువులు తిస్త వేయడంతో వాహనదారులు, పాదచారులు అవస్థలు పడు తున్నారు. వీటివల్ల తరచూ ప్రమాదాల బారిన పడు తున్నామని ఆందోళన చెందుతున్నారు. పశువుల సంచారం. ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. ఆకలి తీర్చుకునేందుకు సత్తుపల్లి మునిసిపాలిటీలోని జాతీయ రహదారికి ఇరువైపులా చిక్కబడితే అక్కడే తిష్ట వేసి కూర్చుంటున్న పశువులతో ప్రమాదం పొందినన్నా సం బంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వాహన దారులు వాపోతున్నారు. ట్రాఫిక్ ను నియంత్రించేబదుకు పోలీసు సిబ్బంది సైతం ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో ప్రయాణికులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. మూగజీవాలు రోడ్ల వెంట ఉండే వ్యర్థాలు, కుళ్లిన, పాడైన పండ్లు, కూరగాయాల కోసం సందరిస్తుండగా, షాపుల వద్దకు రాగానే కొందరు ఆహారం.. తినిపిస్తూ పూజిస్తున్నారు. పశువుల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడితే యజమానులపై చర్యలు తీసుకుంటా మని అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎవరి "పైనా ధర్యలు తీసుకున్న దాఖరాలు లేవు. అసలే జాతీయ రహదారి కావడంతో నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీగా ఉంటే సత్తుపల్లి పట్టణంలో ప్రాణసంకటంలా పశువులు కనిపిస్తు న్నాయి. అదేవిధంగా భారీ వాహనాలు ఢీకొని పశువులు సైతం మృత్యువాతకు గురవుతుండగా పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పశువల సుచారాన్ని ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు పోగొట్టుకోవడంతో ఆరికట్టే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
[zombify_post]